ETV Bharat / state

రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పెరిగే అవకాశం

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 46 డిగ్రీలతో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పైగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

author img

By

Published : May 10, 2019, 5:32 AM IST

Updated : May 10, 2019, 8:25 AM IST

రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పెరిగే అవకాశం
రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పెరిగే అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. 46 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు మరో మూడు రోజుల పాటు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్పా బయటకు రావద్దని సూచిస్తున్నారు.
తెలంగాణలో గురువారం రోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. అత్యల్పంగా నారాయణ పేట, కామారెడ్డిలో 40 డిగ్రీలు రికార్డు అయ్యాయి. అలాగే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్‌, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లి, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలలో 46.4 డిగ్రీలు నమోదు అయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘణపూర్‌ మండలం చిల్పూర్‌లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
రాబోయే రోజుల్లో 47 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలి'

Intro:. వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
..........    .........   ......
TG_WGL_27_09_BAVILO_PADINA_PASHUVULU_AV_G1
..........    .........   ......
మేత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారి పడిపోయిన మూగజీవాల లో ఒకటి మృతిచెందగా మరొక దానిని ప్రాణాలతో తండావాసులు కాపాడారు. రెండు గంటల పాటు శ్రమించి దానిని బయటకు తీసి పునర్జన్మ కల్పించారు..
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టీగూడెం శివారు పంతులు తండాలో  ధారవత్ లచ్చు అనే రైతుకు కాడెద్దు, ఆవు ఉన్నాయి .ఉదయం మేత కోసం వీటిని ఆయన భార్య బాజూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూములకు తోలు కెళ్ళింది.ఓ రైతుకు చెందిన బావి లో ఉన్న వేప ఆకులను మేతగా మేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో లో రెండింటికి లంకె పెట్టి ఉన్నాయి. కాడెద్దు, ఆవు 2 ప్రమాదవశాత్తు కాలుజారి భావి లో పడిపోయాయి .బావి లోతు గా ఉండడంతో ఆవు మృతి చెందగా కాడెద్దు ప్రాణాలతో మిగిలిపోయింది. బావిలో పడిపోయిన పశువులను గుర్తించిన తండావాసులు ట్రాక్టర్ సహాయంతో రెండు గంటల పాటు శ్రమించి మూగ జీవాన్ని బయటకు తీసి పునర్జన్మ కల్పించారు.ఆవు మృతి తో 30000 నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు రైతు భార్య బాజూ మృతి చెందిన ఆవు పై పడి రోదిస్తున్న తీరు తండావాసులు కంటతడి పెట్టించింది

Body:TG_WGL_27_09_BAVILO_PADINA_PASHUVULU_AV_G1_SD

Conclusion:TG_WGL_27_09_BAVILO_PADINA_PASHUVULU_AV_G1_SD
Last Updated : May 10, 2019, 8:25 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.