రైతుల కష్టాలు సర్కారు కంటికి కనిపించటం లేదని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. వచ్చే నెలలో అఖిల పక్షం సమక్షంలో రైతుబంధు పథకం ఫలాలు అందని రైతుల కోసం భిక్షాటన చేయనున్నట్టు ప్రకటించారు. తెలంగాణకు వ్యతిరేకి అయిన జగన్ వంటి వారితో కలిసి పనిచేయటాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేయాలన్న ఆయన... అటు వైకాపా, భాజపాలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భాజపా నేతి బీరకాయ చందంగా పరిపాలన సాగిస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడి నిండా నెల రోజులు పూర్తి కాకుండానే జగన్ కక్ష్య పూరిత రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ఇంటికి వైఎస్ఆర్ హయాంలోనే పూర్తిగా అనుమతులు ఇచ్చారన్న ఆయన.... తమ పార్టీ అధ్యక్షునికి భద్రత తొలగింపు సైతం కుట్రలో భాగమేనని విమర్శించారు.
ఇవీ చూడండి: రోగుల మధ్య అటెండర్ల 'టిక్‌టాక్' చిందులు