మోదీ పాలనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంలో.. అభివృద్ధి పాటే తప్పా... పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి పతనం గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. తగ్గిన జీడీపీని పెరిగినట్టు చూపించడానికే కొత్త రకమైన అకౌంటింగ్ విధానాన్ని అవలంభించారని సురవరం విమర్శించారు.
