ఈ నెల 10 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. ఈ ఏడాది 7.57శాతం ఫెయిలవ్వగా... సప్లిమెంటరీలో సగానికి పైగా ఉత్తీర్ణులయ్యారు. 50 వేల 192 మంది హాజరు కాగా... 26 వేల 898 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 53.59 శాతం ఉండగా... వీరిలో 50.92 శాతం బాలురు, 57.90 శాతం బాలికలు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 96.50శాతం... హైదరాబాద్లో అత్యల్పంగా 34.08 శాతం మాత్రమే గట్టెక్కారు. సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల రీ కౌంటింగ్ కోసం రేపటి నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సుధాకర్ తెలిపారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇదీ చూడండి: పాటలతో పాఠాలు... చిన్నారుల్లో విజ్ఞానం