.
ఎక్సైజ్, క్రీడా, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ-బ్లాక్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, ఉద్యోగులు స్వాగతం పలికారు.
గత ప్రభుత్వాల హయాంలో గీతా కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారని, ప్రమాదంలో చనిపోయిన, అంగవైకల్యం వచ్చిన గీతా కార్మికులకు రూ.6 లక్షలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కల్తీ మద్యం, అక్రమ రవాణా పూర్తిగా తగ్గిందని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఉద్యోగులంతా పనిచేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.