ETV Bharat / state

గుప్పెడు ఇసుకతో దేశాలు దాటేస్తున్నాడు - venugopal

గాజు ప్లేట్​ మీద ఇసుక చల్లి గోటితో అలా అలా గీస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు హైదరాబాద్​కు చెందిన వేణుగోపాల్. సొంతంగా సాండ్​ ఆర్ట్​ను నేర్చుకుని స్వయంకృషితో జాతీయస్థాయిలో వేణు గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇసుకతో ఇల్లాలి దృశ్యం
author img

By

Published : Feb 10, 2019, 3:26 PM IST

Updated : Feb 10, 2019, 3:43 PM IST

ఇసుకతో గీసిన అద్భుత చిత్రాలు
సాండ్​ ఆర్ట్​ ప్రపంచంలోనే అరుదైన కళ. మన దేశంలో అతితక్కువ మందికి తెలిసిన కళ కూడా. సొంతంగా ఇసుకతో అద్భుతాలు చేయడం నేర్చుకున్నాడు హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన వేణుగోపాల్‌. కళపై మక్కువతో డిగ్రీని మధ్యలో ఆపేసి విజువల్​ కమ్యూనికేషన్​ కోర్సులో చేరాడు.
undefined

పూలు, చెట్లకు సంబంధించిన చిన్న చిన్న చిత్రాలతో ప్రారంభించిన వేణుగోపాల్ మెల్లగా తన కళకు సామాజిక అంశాలు జోడించాడు. మహిళా దినోత్సవం, మాతృదినోత్సవం ఇలా సందర్భానికి తగ్గట్టు ఇసుక రేణువులతో అద్భుత చిత్రాలను వేయడం ప్రారంభించాడు.

జాతీయస్థాయి వేదికలపై తెలంగాణ చరిత్రను ఇసుకతో అందంగా వేస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, గ్లోబల్‌ వార్మింగ్‌తో పాటు కేంద్రప్రభుత్వ పథకాలనూ చిత్రీకరిస్తున్నాడు.

అనేక రాష్ట్రాల్లో వివాహ వేడుకలు, పలు కంపెనీల వార్షికోత్సవాలు, లోగో ఆవిష్కరణలు ఇలా పలు రకాల ఈవెంట్లలో తన కళని ప్రదర్శించి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు. ఇప్పటి వరకు ఆరు వందలకు పైగా కార్యక్రమాల్లో సాండ్‌ఆర్ట్‌ను ప్రదర్శించాడు. 2014లో డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్​రావత్‌ చిత్రాన్ని నిమిషనంన్నరలో వేసి అతని ప్రశంసలు అందుకున్నాడు.

అద్భుతమైన కళానైపుణ్యంతో వేణుగోపాల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆంధ్రాబుక్‌ ఆఫ్ రికార్డ్స్‌, భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాడు.

Intro:Body:

gfghahrh

Conclusion:
Last Updated : Feb 10, 2019, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.