తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ ఇవాళ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని పిటిషన్లో రవిప్రకాశ్ పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో వివాదం ఉండగానే క్రిమినల్ కేసులు నమోదు చేశారన్నారు. రవిప్రకాష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తయి.. తీర్పు రిజర్వులో ఉంది.
ఇవీ చూడండి: గ్రామ గ్రామాన బలోపేతం దిశగా తెరాస