రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పవిత్ర రంజాన్ సమయంలో ఉపవాసం మరియు ప్రార్థన యొక్క ముగింపును సూచిస్తుందని అన్నారు. సహోదరత్వం, సామరస్య స్ఫూర్తిని నింపుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు తమ సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా శాంతి, మత సామరస్యం వెల్లివిరిసేలా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం