ETV Bharat / state

ఇంకా ఏం చేయాలంటారూ..?

రైలు ప్రయాణం ఎలా ఉంది... సౌకర్యాలు బాగున్నాయా... ఎమన్నా సలహాలు ఇవ్వొచ్చుకదండీ... అంటూ దక్షిణ మధ్య రైల్వే కొత్త జనరల్ మేనేజర్ ప్రయాణికులతో ముచ్చటించారు.

ప్రయాణికులతో రైల్వే జీఎఁ
author img

By

Published : Mar 3, 2019, 7:09 AM IST

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్ మ్యా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్​లో పర్యటించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్​లో ప్రయాణించారు. రైళ్ల నిర్వహణ గురించి ప్రయాణికులను అడిగి, మెరుగుపర్చేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు.
లింగంపల్లి స్టేషన్​లో ప్రాంగణమంతా తిరుగుతూ... ప్రయాణికుల వసతి, సౌకర్యాలు, ఎస్కలేటర్ పనులు, బుకింగ్ కార్యాలయ విస్తరణ, కేటరింగ్ స్టాళ్లు, పార్కింగ్ స్థలాన్ని పర్యవేక్షించారు. హైటెక్ సిటీ, బేగంపేట్, ఫలక్​నుమా స్టేషన్​లను పరిశీలించారు. రైల్వే కోచ్​లోని సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు.

ఇవీ చూడండి:సంఝౌతా పునఃప్రారంభం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.