ETV Bharat / state

పాలిసెట్ ప్రవేశ పరీక్ష​ ఫలితాల విడుదల - results

తెలంగాణ పాలిసెట్-2019 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ విడుదల చేశారు. మొత్తం 92.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

పాలిసెట్ ప్రవేశ పరీక్ష​ ఫలితాల విడుదల
author img

By

Published : Apr 26, 2019, 12:34 PM IST

తెలంగాణ పాలిసెట్-2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఫలితాలను విడుదల చేశారు. 92.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. బాలురలో సృజన్‌, సాత్విక్‌, ఆశిష్‌రెడ్డి, సుమంత్‌, వరుణ్‌ తేజ ప్రథమ ర్యాంకు సాధించగా.. అమ్మాయిల్లో సాయి శ్రీహిత రెడ్డి తొలి స్థానంలో నిలిచారు.

మే మొదటి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించి, జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు సాంకేతిక విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 16, 2019 నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,03,591 మంది విద్యార్థులు హాజరయ్యారు.

టాప్ 15 ర్యాంకుల్లో 11 సూర్యాపేట విద్యార్థులకే రావడం విశేషం. మరో స్థానాలు సిద్దిపేటకు, ఖమ్మం, భద్రాచలం జిల్లాలకు మరో 2 ర్యాంకులు వచ్చాయి.

ఇవీ చూడండి:కాళేశ్వరంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.