ETV Bharat / state

కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్

స్థానిక సంస్థల మూడో విడత పోలింగ్​ ప్రారంభమైంది. ​మూడో విడతలో 161 జడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు,  మిగిలిన స్థానాల్లో  సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ప్రారంభమైన స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్
author img

By

Published : May 14, 2019, 6:57 AM IST

Updated : May 14, 2019, 12:02 PM IST

తుది దశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడో విడతలో 161 జడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్​ జరుగుతోంది. 161 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది, 1708 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, ఆసిఫాబాద్‌, భద్రాద్రి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి విడతలో వాయిదాపడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు కూడా నేడు పోలింగ్​ నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. 27 జిల్లాల్లో 9,494 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 46 లక్షల 64 వేలకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

పోలింగ్​ ప్రారంభం

ఇవీ చూడండి: నేడే చివరి దశ ప్రాదేశిక పోరు...

Intro:Body:

start

Conclusion:
Last Updated : May 14, 2019, 12:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.