ప్రాదేశిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 217 చోట్ల... సాయంత్రం 4 గంటల వరకు, 1880 ఎంపీటీసీ స్థానాలకు 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ కోసం గులాబీ, జడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తున్నారు. కేంద్రాల్లోకి నీళ్ల సీసాలు, ఇంకు, అగ్గిపెట్టెలు వంటి అభ్యంతరకరమైన వస్తువులకు అనుమతి నిరాకరించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
ఇవీ చూడండి: నేడు కేరళ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్