ETV Bharat / state

ప్రేమపెళ్లి చేసుకున్న మా కూతురిని చూపించండి

ఉద్యోగవేటలో ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పేరున్న సంస్థల్లో మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడ్డారు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇంతలో మతమార్పిడి చేసి క్షోభకు గురిచేస్తున్నాడంటూ... అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

author img

By

Published : Jun 1, 2019, 6:53 PM IST

Updated : Jun 1, 2019, 7:08 PM IST

మా కూతురిని చూపించండి

మంచిర్యాల జిల్లాకు చెందిన ఇందిర అనే యువతి, కరీంనగర్‌ జిల్లాకు చెందిన రిజ్వాన్‌ అహ్మద్‌ అనే యువకుడు ఉద్యోగ కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చారు. టెక్​ మహీంద్రలో ఇందిర, జెన్​ప్యాక్​లో రిజ్వాన్​ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మతాలు వేరు కావటం వల్ల ఇందిర తల్లిదండ్రులకు చెప్పకుండా గతేడాది వివాహం చేసుకున్నారు. అనంతరం మతమార్పిడి చేయించాడు రిజ్వాన్​.

మత మార్పిడి చేశారు

ప్రేమ పేరుతో తమ కూతురిని వివాహం చేసుకుని మత మార్పిడి చేశాడని ఇందిర తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కూతురిని చూపించకుండా క్షోభకు గురిచేస్తున్నాడని వారు మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. ఇదివరకే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా... ఇద్దరు మేజర్లు అయినందున జోక్యం చేసుకోకుండా తల్లిదండ్రులకు సర్ది చెప్పి పంపించారు. ఇవాళ మరోసారి ఠాణాకు వచ్చి పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిర తల్లిదండ్రులు. కూతురిని చూపించాలని కోరినప్పటికీ పట్టించుకోకుండా రిజ్వాన్​కు మద్దుతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్నవి ఆసత్య ఆరోపణలేనని, ప్రేమ వివాహం, మతమార్పిడి విషయం ఇందిర కుటుంబసభ్యులకు ఇంతకుముందే తెలుసని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు.

మా కూతురిని చూపించండి

ఇవీ చూడండి: బావిలో పడి బతికొచ్చాడు...

Intro:Body:Conclusion:
Last Updated : Jun 1, 2019, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.