ETV Bharat / state

స్థానిక సమరానికి జోరందుకున్న నామినేషన్ల పర్వం - undefined

స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు  1278 మండల, 154 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు నామపత్రాలు సమర్పించారు.

స్థానిక సమరం
author img

By

Published : Apr 24, 2019, 3:02 AM IST

Updated : Apr 24, 2019, 9:15 AM IST

స్థానిక సమరం

తొలి విడత స్థానిక సంస్థల్లో.. 2166 మండల పరిషత్​, 197 జిల్లా పరిషత్​ ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు 1278 మండల, 154 జిల్లా పరిషత్​ స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. సంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 138 దాఖలయ్యాయి. నల్గొండ జిల్లాలో 97, కామారెడ్డిలో 87, రంగారెడ్డిలో 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ములుగులో రెండు, వరంగల్​ అర్బన్​లో ఒకటి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
దాఖలైన 154 జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో అత్యధికంగా సంగారెడ్డిలో 16, నల్గొండలో 11, రాజన్న సిరిసిల్లలో 10 మంది నామపత్రాలు సమర్పించారు. నారాయణ పేటలో ఒకటి, జోగులాంబ గద్వాలలో రెండు దాఖలయ్యాయి. ములుగు, సిద్దిపేటలో ఒక్కరు కూడా నామపత్రాలు సమర్పించలేదు.

ఇవీ చూడండి: ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు పదోన్నతులు

sample description
Last Updated : Apr 24, 2019, 9:15 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.