ETV Bharat / state

త్వరలో వీసీల నియామక ప్రకటన - university

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త వీసీల నియామకానికి కసరత్తు చేస్తోంది. నేడో, రేపో నియామక ప్రకటన వెలువడనుంది. అర్హులైన ఆచార్యులు 14 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

త్వరలో వీసీల నియామక ప్రకటన
author img

By

Published : Jul 3, 2019, 9:36 AM IST

Updated : Jul 3, 2019, 12:19 PM IST

రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకానికి రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడనుంది. దీనిపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవీకాలం జూన్‌ 29తో ముగియగా.. మరో ఏడుగురు ఉపకులపతులకు ఈ నెలాఖరులో పదవీకాలం ముగియనుంది. శాతవాహన, బాసరలోని ఆర్‌జీయూకేటీలకు ఉపకులపతులనే నియమించలేదు. మాసబ్‌ట్యాంకులోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఉపకులపతికి జనవరి వరకు గడువుంది. ఈ నెలాఖరుకు ఎక్కువ ఉపకులపతుల పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.

గతంలో ఉపకులపతులను నియమించినప్పుడు ఎస్‌సీ, ఎస్‌టీలకు ఆచార్యులుగా అయిదేళ్ల అనుభవం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. దానిపై కొందరు న్యాయస్థానానికి వెళ్లగా ఇకనుంచి పదేళ్ల యూజీసీ నిబంధనను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈసారి ఆ నిబంధననే అమలు చేయనున్నారు. అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి 14 రోజులు గడువు ఇవ్వనున్నారు. వాటిని పరిశీలించి అన్వేషణ కమిటీ ముగ్గురిని సిఫార్సు చేస్తుంది. వారిలో ఒకరిని ప్రభుత్వం ఉపకులపతిగా నియమిస్తుంది.

ఈనెల 1న విద్యాశాఖ అధికారులతో సమావేశమైన గవర్నర్‌ నరసింహన్‌ విశ్వవిద్యాలయాలకు ఈనెల తర్వాత ఉపకులపతులు ఉండరు కదా.. ఎవరితో సమీక్షించాలి అని ప్రశ్నించినట్లు సమాచారం. కొత్త ఉపకులపతులను నియమిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి ఆయనకు చెప్పారు. అలాగైతే ఆగస్టు మొదటివారంలో మళ్లీ కొత్త ఉపకులపతులతో సమావేశమవుతానని గవర్నర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఇవీ చూడండి: అటవీశాఖ అధికారి దాడి ఘటనపై మంత్రుల భేటీ

Last Updated : Jul 3, 2019, 12:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.