ఉపాధ్యాయల వేతనాలు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయల వేతనాలు దేశంలో ఏడో స్థానంలో ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో సంఘాలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని... వాటిని నియంత్రించే శక్తి ప్రభుత్వాలకు లేదన్నారు. గురుకుల విద్య పేరుతో ప్రాథమిక విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. శాసనమండలిలో ప్రతిపక్షంగా కాకుండా ప్రజాపక్షంగా పోరాడతానన్నారు.
ఇవీ చూడండి: వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు...!