ETV Bharat / state

విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడొద్దుః నిరంజన్ రెడ్డి - khareef

ఖరీఫ్​ సాగుకు రైతులకు విత్తనాల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ శాఖ అవసరమైన రాయితీ విత్తనాలు అందుబాటులో ఉంచింది. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకంతో సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఖరీఫ్​కు విత్తనాలు సిద్ధం
author img

By

Published : May 28, 2019, 8:34 PM IST

ఖ‌రీఫ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రైతాంగానికి అవసరమైన విత్తనాలు వ్యవ‌సాయ శాఖ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంచింది. విత్తనాల విషయంలో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని ఆ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఖ‌రీఫ్​లో సాగు చేసే వివిధ ర‌కాల పంటలకు సంబంధించి 7.50 ల‌క్షల క్వింటాళ్ల విత్తనాలు అవ‌స‌రమని అంచనా వేయగా... అందుకోసం 174 కోట్ల 87 లక్షల రూపాయల రాయితీ ప్రభుత్వం అందిస్తుంద‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ, హాకా, ఆయిల్‌ఫెడ్‌, మార్క్‌ఫెడ్‌, జాతీయ విత్తన కార్పొరేష‌న్ వంటి ప్రభుత్వ నోడ‌ల్ ఏజ‌న్సీల‌ ద్వారా విత్తనాలు స‌ర‌ఫ‌రా చేస్తార‌ని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల క‌లెక్టర్లు ఎంపిక చేసిన‌ 1498 ప్రాథ‌మిక వ్యవ‌సాయ స‌హ‌కార కేంద్రాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, మ‌న‌ గ్రోమోర్ కేంద్రాల ద్వారా రాయితీ విత్తనాలు అంద‌జేయనున్నట్లు తెలిపారు.

ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్​ తీసుకొని వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించి అన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ అనుమతి పత్రంతో విత్తన విక్రయ కేంద్రాల్లో విత్తనాలు పొందవచ్చని స్పష్టం చేశారు. 19 వేల 356 క్వింటాళ్ల విత్తనాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రైతుల సౌకర్యార్థం... రూపొందించిన ప్రణాళికలకు అద‌నంగా 20 నుండి 30 శాతం విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాల‌ని మంత్రి ఆదేశించారు.

ఖరీఫ్​కు విత్తనాలు సిద్ధం

సాగు విస్తీర్ణం అంచనా...

పంట విస్తీర్ణం(హెక్టార్లు లక్షల్లో)
వరి 5.6
జొన్న 20
మొక్కజొన్న 4.44
కందులు 1.33
పెసలు 50
మినుములు 31
వేరుశనగ 67వేలు
సోయాబీన్ 2.66

ఇవీ చూడండి: 'ఎంపీ ఫలితాలు తెరాసకు ఎదురు దెబ్బకాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.