గురుకులాల విద్యకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న దృష్ట్యా... విద్యాలయాల్లో వంద శాతం అడ్మిషన్లు జరిగేలా కృషి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్‌లో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై లక్షా 20 వేల రూపాయలు వెచ్చిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు డైట్ ఛార్జీలు రూ.950, 8 నుంచి పదో తరగతి వారికి రూ.1100, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ.1500 అందచేస్తున్నామని వివరించారు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అదనంగా అందిస్తున్నారు. బట్టలు శుభ్రపరచుకోవడం, కాస్మోటిక్, హెయిర్ కటింగ్ ఛార్జీలకు బదులుగా త్రైమాసికాల వారిగా ఆరోగ్యం, పరిశుభ్రత కిట్లు అందించటం వంటి విధానాలతో విద్యార్థులు గురుకులాల వైపు ఆకర్షితులవుతున్నారని మంత్రి చెప్పారు. అడ్మిషన్ల ప్రక్రియలో గురుకులాల సిబ్బంది పూర్తిగా సహకరించి వంద శాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్న గోదారమ్మ