చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చిరుధాన్యాల పరిశోధకులు ఖాదర్ వలి అన్నారు. ప్రతిరోజు తీసుకుంటున్న ఆహార పదార్థాలతోనే ప్రకృతి విధ్వంసం జరుగుతోందన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిరుధాన్యాల రూపంలో మన దేహంలోకి రోగనిరోధక శక్తిని పంపాల్సిన అవసరం ఉందన్నారు ఖాదర్ వలి. రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్ల వచ్చే వ్యాధులకు తృణధాన్యాలే మందు అని తెలిపారు.
ఇవీ చూడండి: మాటకు లక్ష... పాటకు మిలియన్...