ఎన్నికల నియమావళి...
రాష్ట్రంలోనూ కోడ్ అమల్లో ఉన్నందున.. స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పూర్తి చేసుకుంటే మళ్లీ నియమావళిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని సర్కార్ భావిస్తోంది. వచ్చే నెల 11న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా... మే 15 నుంచి రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
ఫలితాల అనంతరమే...
లోక్సభ ఓట్ల లెక్కింపు నాటికి పోలింగ్ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి స్పష్టం చేసింది. ఫలితాల ప్రకటన మాత్రం మే 23 తర్వాతే చేపడతామని లేఖలో పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభనజకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేయాలని నిర్ణయించింది.
షెడ్యూల్ ప్రకటన...
నియోజకవర్గాల వారిగా ఓటర్ల జాబితా ప్రకటనకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. రేపు గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుదిజాబితాను విడుదల చేయనున్నారు. 30న మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ల ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈసీ అనుమతి వస్తే... ఏప్రిల్ 15న షెడ్యూల్ విడుదల చేసి రెండు దఫాల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి:ఈసీ కొరడా : భారీగా అక్రమ నగదు, మద్యం సీజ్