ETV Bharat / state

కాంగ్రెస్​లో కొరవడిన ఏకాభిప్రాయం - komatireddy rajagopal reddy

తెలంగాణ కాంగ్రెస్‌ శాసన సభాపక్షం వ్యూహాలు శాసనసభలో బెడిసి కొట్టాయి. ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో కూడా ఏకాభిప్రాయం కొరవడిన తీరు ఇవాళ బట్టబయలైంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై నిరసన వ్యక్తం చేయడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం ఆ పార్టీలో సమన్వయ లోపాన్ని తేటతెల్లం చేసింది.

కాంగ్రెస్​లో కొరవడిన ఏకాభిప్రాయం
author img

By

Published : Jul 18, 2019, 11:14 PM IST

కాంగ్రెస్​లో కొరవడిన ఏకాభిప్రాయం

తెలంగాణలో నాయకత్వ లోపం వల్లనే పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో విలీనమయ్యారన్న వాదనకు ఇవాళ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వం సరిగా లేదని అభియోగాలు చేస్తూ హస్తం గుర్తుపై గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో విలీనమయ్యారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలుపొందిన కారణంగా రాజీనామా చేశారు. మొత్తం 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 13 మంది పోగా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

పార్టీకి దూరంగా నేతలు...

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యలు చేయడమేకాక కాంగ్రెస్​ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు పార్టీ క్రమ శిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. ఆ నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ గత కొంతకాలంగా రాజగోపాల్‌ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలోనే ఉన్నప్పటికీ తరచూ తెరాసకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో సమన్వయ లోపం ఉన్నట్లు స్పష్టమైంది.

ఎమ్మెల్యేల్లో కొరవడిన ఏకాభిప్రాయం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. అదే విధంగా ఫిరాయింపుల అంశంపై చర్చ జరిగిన సందర్భంగా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేయాలన్న సీఎల్పీ నేత అభిప్రాయాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇప్పుడు దానిపై నిరసన వ్యక్తం చేసినా... ఒరిగేదేమీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది. చివరకు నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయానికి వచ్చారు. సమావేశమైన అయిదుగురు ఎమ్మెల్యేల్లో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్యలు నల్ల కండువాలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాగా... కండువా వేసుకోకుండానే జగ్గారెడ్డి సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం అయ్యే వరకు ఉండి...సభ నుంచి జగ్గారెడ్డి బయటకు వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైనా అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరయ్యారు. అసెంబ్లీ వద్ద నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయగా..అక్కడే ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పాల్గొనలేదు.

హస్తం పార్టీకి పొంచి ఉన్న ప్రమాదం

ఎమ్మెల్యేలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందింది. హస్తం గుర్తుపై గెలుపొందిన తమకు నాయకత్వంపై విశ్వాసం లేకపోవడంతోనే అధికార కారెక్కామని 12 మంది ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది.

ఇవీ చూడండి: తొలిరోజు... వాడివేడిగా ప్రత్యేక అసెంబ్లీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.