యువతలో రాజకీయ విలువలపై అవగాహన కల్పించడానికి కేరళ ప్రభుత్వం ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ కవితను కేరళ ప్రభుత్వం ఆహ్వానించింది.
కల్వకుంట్ల కవిత
By
Published : Feb 5, 2019, 2:21 AM IST
తెలంగాణ ఆడపడుచుకు కేరళ ఆహ్వానం
యువతలో రాజకీయ, ప్రజాస్వామిక విలువల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రసంగించేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆహ్వానిస్తూ కేరళ శాసనసభాపతి శ్రీరామకృష్ణన్ లేఖ రాశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. 23న మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు క్యాస్ట్ అండ్ ఇట్స్ డిస్కంటెన్ట్స్ అనే అంశంపై కవిత ప్రసంగిస్తారు. దేశ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి దాదాపు రెండు వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.