చరిత్రలో
చరిత్ర చూసుకుంటే ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ 1955-56, 1957-58లో బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా కొనసాగుతూనే ఆర్థికశాఖ బాధ్యతలను చేపడుతూ 1968-69, 1969-70 రాష్ట్ర పద్దులను సమర్పించారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 2010లో ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా 2010-11 బడ్జెట్‌ను సభ్యులకు వివరించారు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ కూడా సీఎంగా ఉంటూ రాష్ట్రపద్దు ప్రవేశపెడుతున్నారు.