వాయువ్య, ఉత్తర దిక్కు నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని... పిల్లలు, వృద్ధులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట రాకూడదంటున్న వాతావరణశాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు - imd
ఉత్తరం, వాయువ్య దిక్కుల నుంచి వీస్తున్న పొడిగాలులకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందని చెప్పారు.