ETV Bharat / state

టీఆర్టీ నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా

టీఆర్​టీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. పాత జిల్లాల ప్రాతిపదికన ఎంపిక కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. ముందుగా ఉపాధ్యాయులు లేని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

టీఆర్టీ నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా
author img

By

Published : Jul 6, 2019, 11:26 PM IST

ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. టీఆర్​టీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వుల జారీకి విధివిధానాలు ఖరారు చేసింది. ఇందుకోసం పాత జిల్లాల ప్రాతిపదికన కమిటీలు ఏర్పాటు చేసింది. ఛైర్మన్​గా కలెక్టర్, వైస్ ఛైర్మన్​గా జాయింట్ కలెక్టర్, కార్యదర్శిగా డీఈవో, సభ్యులుగా జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, కొత్త జిల్లా డీఈవో ఉంటారు.

రోస్టరు, ర్యాంకు వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్... జిల్లా ఎంపిక కమిటీలకు పంపిస్తారు. డీఈవోలు సబ్జెక్టు, మీడియం, ప్రాంతం వారీగా ఖాళీలు గుర్తించి... ఉపాధ్యాయులు లేని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా నివేదిక సిద్ధం చేసుకోవాలి. బాలికల పాఠశాలల్లో మహిళ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలి.

కౌన్సెలింగ్ వివరాలు అభ్యర్థులకు స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తారు. గైర్హాజరైన అభ్యర్థులకు మిగిలిపోయిన పోస్టులు కేటాయించి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమాచారం ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. టీఎస్​పీఎస్సీ మార్గదర్శకాలు అనుసరించి పోస్టింగ్ ఇచ్చిన అభ్యర్థుల వివరాలు నోటీసు బోర్డుల్లో పెట్టాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సూచించారు.

టీఆర్టీ నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి ఇచ్చే 10కోట్లు కొట్టేస్తా: జడ్పీ ఛైర్మన్

Tg_Hyd_55_06_Trt Candidates Round Table_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam యాంకర్ - ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం టీచర్ ట్రైనింగ్ టెస్ట్ (టిఆర్టీ) కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని టిఆర్టీ సెలెక్ట్ అభ్యర్థులు వేడుకున్నారు. ఫలితాలు ప్రకటించి ఏడాది గడుస్తున్నా నియమకాల్లో ఆలస్యం పై అభ్యర్థులు హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.2017 సంవత్సరానికి చెందిన 8792 మంది అభ్యర్దులను టీఎస్పీఎస్సి ఎంపిక చేసిందని... ఏడాది గడుస్తున్నా,పోస్టింగ్ లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఇన్ని రోజులుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తమ కుటుంబాలు ప్రస్తుతం రోడ్డున పడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ నెలాఖరులోగా తమకు పోస్టింగ్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో... 8,792 మంది ఆత్మహత్య శరణ్య మన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కోర్టు కేసు లను పరిష్కరించి... పెండింగ్ లో ఉన్న 1:1ఫలితాల లిస్టులను ప్రకటించాలని... లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. బైట్ - అభ్యర్దులు -----
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.