ఇదీ చదవండిఃనేటి నుంచి అందుబాటులోకి మీరాలం పార్కు
డ్రిల్ మెషిన్లో ఒకరు.. వెండి పూతతో మరొకరు
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లలో మార్పు రావడం లేదు. ఏదో రూపంలో బంగారం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇలాగే తీసుకొస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు ఇద్దరు ప్రయాణికులు పట్టుబడి పోయారు. వారి వద్ద 800 గ్రాముల పుత్తడి దొరికింది.
800 గ్రాముల బంగారం పట్టివేత
విశ్వసనీయ సమాచారంపై హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్ రవి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. రియాజ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డ్రిల్లింగ్ మిషన్‌లో కడ్డీరూపంలో అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి దగ్గర 200 గ్రాములున్న సిల్వర్ పూత పూసిన బంగారు ప్లేట్‌ను పట్టుకున్నారు. వీటి విలువ రూ.27 లక్షలుగా తెలిపారు.
ఇదీ చదవండిఃనేటి నుంచి అందుబాటులోకి మీరాలం పార్కు
Last Updated : Mar 23, 2019, 12:54 PM IST