ETV Bharat / state

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్ షేక్​పేటలో ఉదయం ఫ్లైఓవర్​ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద స్థలాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి కాంట్రాక్టు ఏజెన్సీ ద్వారా పరిహారం అందజేయాలని దాన కిషోర్ ఆదేశించారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్
author img

By

Published : Jul 2, 2019, 12:44 PM IST

హైదరాబాద్ షేక్‌పేటలో ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న భారీ క్రేన్ కిందపడి దాని ఆపరేటర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భారీ క్రేన్‌ ఒక్కసారిగా అదుపుతప్పటంతో భయంతో ఆపరేటర్ కిందకు దూకే ప్రయత్నంలో కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ మృతి చెందడంపట్ల కమిషనర్ విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి కాంట్రాక్టు ఏజెన్సీ ద్వారా పరిహారం అందజేయాలని దాన కిషోర్ ఆదేశించారు. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో దురదృష్టకర సంఘటన జరగడం ఇదే మొదటిసారన్నారు. షేక్‌పేట వద్ద కుంగిన భారీ క్రేన్‌ను వెంటనే తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రాజెక్టు విభాగం ఇంజినీరింగ్ అధికారులను దాన కిషోర్ ఆదేశించారు. క్రేన్ పడిపోయిన ప్రాంతంలో వాటర్ పైప్‌లైన్‌, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఏ విధమైన నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి:
క్రేన్​ మీదపడి వ్యక్తి మృతి... షేక్​పేటలో భారీ ట్రాఫిక్​ జామ్​

Intro:TG_NZB_03_02_HATYA_AV_3180033
Reporter: Srishylam.k, camera: manoj
(. ) కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి ని కట్టుకున్న భార్య, కన్న కొడుకులే కడతేర్చారు. బీర్కూర్ మండలం కిష్టపూర్ లో కామయ్య(65) అనే వ్యక్తి అర్థరాత్రి తర్వాత హత్యకు గురయ్యాడు. కొంతకాలంగా ఇంటికి వెళ్లకుండా కుటుంబానికి దూరంగా ఉంటున్న కామయ్య ను నిన్న రాత్రి కొడుకు, భార్య కలిసి ఉరేసి హత్య చేశారు. అనంతరం కొడుకు బీర్కూర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.... visBody:శ్రీశైలంConclusion:9394450045

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.