ETV Bharat / state

ఇంటర్​ వివాదం: ఎంసెట్ అభ్యర్థుల్లో కలవరం - students

ఎంసెట్ రాసే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను ఇంటర్ ఫలితాలు కలవరపెడుతున్నాయి. ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగా మార్కులు తక్కువ రావడంతో ఎంసెట్​లో వెయిటేజీ తగ్గిపోయి ర్యాంకుల్లో వెనుకబడిపోతామన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. పునఃపరిశీలనతో మార్కులు పెరగకపోతే నాణ్యమైన ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో సీటు రాదని తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు.

ఎంసెట్ అభ్యర్థుల్లో కలవరం
author img

By

Published : Apr 25, 2019, 10:56 AM IST

ఎంసెట్ అభ్యర్థుల్లో కలవరం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన తప్పులు ఎన్నో విధాలుగా విద్యార్థుల మెడకు చుట్టుకుంటున్నాయి. ఎంపీసీ, బైపీసీలోని ప్రధాన సబ్జెక్టులైన గణితం, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల్లో అత్యధిక మార్కులు వస్తాయని భావించిన ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఇంటర్​లో కొన్ని సబ్జెక్టుల్లో తప్పారు. ముఖ్యంగా గణితం-2 బీ, భౌతికశాస్త్రం సబ్జెక్టులో ఎక్కువ మంది తప్పినట్లు అంచనా. వేల మంది విద్యార్థులు... వారికి వచ్చిన మార్కులు చూసి ఖంగు తిన్నారు. 80-90 శాతంపైగా మార్కులు వస్తాయని ధీమాగా ఉన్నవారు 60 శాతానికి పరిమితం అయ్యారు. ఇదే విషయాన్ని ఇంటర్ బోర్డుకు వస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు చెబుతూ ఎంసెట్లో ఈసారి వెనుకబడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ భాషా సబ్జెక్టులను మినహాయిస్తే మిగిలిన ప్రధాన సబ్జెక్టుల్లో 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ 600 మార్కులకు ఎంసెట్లో 25 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే 600 మార్కులను 25 శాతానికి కుదిస్తారు. ఆ ప్రకారం ఇంటర్ సబ్జెక్టుల్లో ప్రతి 24 మార్కులకు ఒక మార్కు చొప్పున ఎంసెట్లో మార్కును కలుపుతారు. ఎంసెట్లో 160 మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే ఎంసెట్లో వచ్చిన మార్కులను 75 శాతానికి తగ్గిస్తారు. ఎంసెట్ లో 75 శాతం ఇంటర్లో 25 శాతం మొత్తం వంద శాతానికి వంద మార్కులు చూసి ర్యాంకు లెక్కిస్తారు.

ఎంసెట్లో 160కి 120 మార్కుల వరకు తెచ్చుకున్న విద్యార్థులకు పెద్దగా ర్యాంకుల్లో తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎంసెట్​లో తక్కువ మార్కులు వచ్చే కొద్దీ... ప్రతి మార్కు కీలకమవుతుంది. ఒక్కో మార్కు తేడాతో... ర్యాంకు ఎక్కడికో కిందకు పోతుందని ఎంసెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎంసెట్​లోనే కాకుండా ఇతర గ్రూపుల వారికి డిగ్రీ ప్రవేశాలలో నష్టం జరగనుంది. గత మూడు సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు దోస్త్ ద్వారా జరుగుతున్నాయి. ఆ ప్రకారం ఇంటర్​లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్​ను బట్టి కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. దాంతో ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల విద్యార్థులకు సైతం ఇంటర్లో మార్కులు తగ్గితే కొంత నష్టం తప్పదని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదని.. ఆత్మహత్య

రీ కౌంటింగ్, రీ వాల్యూషన్ ఉన్నా... విద్యార్థుల్లో ఆందోళన

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 25 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0259: Japan New Emperor AP Clients Only 4207658
US friend recalls new Japan emperor as young man
AP-APTN-0258: Sri Lanka Japan Victim No access Japan 4207657
Japanese victim's body flown home from Sri Lanka
AP-APTN-0255: Brazil Indigenous AP Clients Only 4207656
Indigenous march in Brasilia over rights, land
AP-APTN-0241: Australia Morrison Sri Lanka No access Australia 4207655
Morrison: Sri Lankan bomber once lived in Australia
AP-APTN-0237: US CA Pedestrians Hit Update Part must credit Sunnyvale Department of Public Safety 4207654
California motorist who drove into people arrested
AP-APTN-0205: Puerto Rico Governor AP Clients Only 4207653
Puerto Rico governor seeks swifter storm recovery
AP-APTN-0146: Sri Lanka Church AP Clients Only 4207652
Security outside St Anthony's Shrine in Colombo
AP-APTN-0122: New Zealand ANZAC William No access New Zealand; Part must not obscure Maori Television logo/Must acknowledge in all spoken, linear, web, social digital coverage that the broadcast is from Maori Television 4207651
William attends ANZAC Day service in Auckland
AP-APTN-0100: US CA Vaccines Hearing AP Clients Only 4207648
Opponents spar over California vaccine bill
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.