తెరపైకి సీతక్క
మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు రేవంత్ దిల్లీ వెళ్లారు. మహబూబాబాద్ స్థానానికి ఇప్పటికే బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, రాములు నాయక్‌లను పరిశీలించిన కమిటీ తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్కను తెరపైకి తీసుకొచ్చింది. ఆదిలాబాద్ స్థానాన్ని లంబాడాలకు కేటాయించి...మహబూబాబాద్‌ను కోయ సామాజిక వర్గమైన సీతక్కకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మంత్రి ఎ. చంద్రశేఖర్
పెద్దపల్లి నియోజకవర్గానికి గోమాస శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు తాజాగా మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేరు వినిపిస్తోంది. నల్గొండకు సంబంధించి పటేల్ రమేశ్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల్లో ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతున్నారు. భువనగిరి నుంచి మధుయాష్కీగౌడ్ ఖరారైనట్టు సమాచారం. నిజామాబాద్‌కు ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు.
తెరాస జాబితా తర్వాతే
ఖమ్మం, మహబూబ్‌నగర్ ఎంపీలు పొంగులేటి, జితేందర్ రెడ్డిలకు తెరాస టికెట్ నిరాకరిస్తుందన్న ప్రచారంతో ఆ స్థానాల్లో వేచి చూడాలని హస్తం భావిస్తోంది. వారు పార్టీలోకి వస్తే ఆయా స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.