త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేకంగా సమన్వయకర్తలను నియమించింది. రెండ్రోజులపాటు క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి జాబితా సిద్ధం చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఆదేశించారు. పార్టీ విధేయులై ఉండి, ప్రజాధరణ కలిగిన వారిని పోటీలో నిలపాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ఈ నెల 18న మరోసారి సమావేశమై 19న తుది జాబితా పీసీసీకి పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
డీసీసీ అధ్యక్షులు, సమన్వయకర్తల వివరాలు
జిల్లా పేరు | డీసీసీ అధ్యక్షులు | సమన్వయకర్తలు |
అదిలాబాద్ | భార్గవ్ దేశ్‌పాండే | ప్రేమలత ఆగర్వాల్ |
ఆసిఫాబాద్ | కె.విశ్వప్రసాద్‌రావు | జనక్ ప్రసాద్ |
మంచిర్యాల | కొక్కిర్ల సురేఖ | నమిండ్ల శ్రీనివాస్ |
నిర్మల్ | రామారావు పటేల్ పవార్ | అల్లం బాస్కర్ |
కరీంనగర్ | కటకం మృత్యుంజయ | మహేశ్‌కుమార్ గౌడ్ |
జగిత్యాల | ఎ.లక్ష్మణ్ కుమార్ | గడుగు గంగాధర్ |
పెద్దపల్లి | ఇ.కొమరయ్య | అష్ఫర్ యూషఫ్ జాహి |
రాజన్న సిరిసిల్ల | సత్యనారాయణగౌడ్ | మదుకర్ యాదవ్ |
నిజామాబాద్ | మనల మోహన్ రెడ్డి | గడ్డం ప్రసాద్‌కుమార్ |
కామారెడ్డి | కైలాస్ శ్రీనివాసరావు | మక్సూద్ అహ్మద్ |
వరంగల్ (గ్రామీణ, పట్టణ) | ఎన్. రాజేందర్ రెడ్డి | అజ్మతుల్లా హుస్సేని |
భూపాపల్లి | గండ్ర జ్యోతి | బండి నర్సాగౌడ్ |
జనగాం | జంగా రాఘవ రెడ్డి | జితేందర్ రెడ్డి |
సంగారెడ్డి | నిర్మలా గౌడ్ | అదెం సంతోష్‌కుమార్ |
మెదక్ | తిరుపతి రెడ్డి | నగేష్ ముదిరాజ్ |
సిద్దిపేట | టి. నర్సా రెడ్డి | ఆకుల రాజేందర్ |
వికారాబాద్ | పి. రోహిత్ రెడ్డి | అమరేందర్ రెడ్డి |
మేడ్చల్ మల్కాజిగిరి | కూన శ్రీశైలం గౌడ్ | జువ్వాడి ఇందిర రావు |
రంగారెడ్డి | చల్లా నరసింహారెడ్డి | జగదీశ్వర్‌రావు |
మహబూబ్‌నగర్ | అబ్దుల్లా కొత్వాల్ | మహ్మద్ ఫిరోజ్ ఖాన్ |
వనపర్తి | శంకర్ ప్రసాద్ | ఎం. జనార్దన్ రెడ్డి |
గద్వాల్ | పటేల్ ప్రభాకర్ రెడ్డి | బి. వెంకటేశ్ ముదిరాజ్ |
నాగర్ కర్నూల్ | సీహెచ్ వంశీకృష్ణ | బొల్లు కిషన్ |
సూర్యాపేట | చెవిటి వెంకన్న యాదవ్ | ఎంఏ ఫహీం |
మహబూబాబాద్ | జె.శరత్ చంద్ రెడ్డి | టి నిరంజన్ |
నల్గొండ | శంకర్ నాయక్ | ఎంఆర్‌జి వినోద్ రెడ్డి |
ఖమ్మం | పువ్వుల దుర్గా ప్రసాద్ | ఇందిర శోభన్ పోసల |
యాదాద్రి భువనగిరి | అనిల్‌కుమార్ రెడ్డి | బి. కైలాస్ కుమార్ |
భద్రాద్రి కొత్తగూడెం | --------------- | సుదర్శన్ ప్రసాద్ తివారి |
ములుగు | నల్లెల కుమార స్వామి | కె. శ్రీనివాస రెడ్డి |
నారాయణ్‌పేట | కె. శివకుమార్ రెడ్డి | సంకేపల్లి సుధీర్ రెడ్డి |
ఇవీ చూడండి: "స్థానిక సంస్థల్లోనూ బీసీలకు అన్యాయమే: భాజపా"