డప్పు చప్పుళ్లు.... డోళ్ల విన్యాసాల మధ్య ఘనంగా గోల్కొండ ఆషాఢ మాస బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటకు భారీగా చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి పూజలు నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు బోనాల ఊరేగింపు జరిగింది. నేటి నుంచి వచ్చే నెల 1 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో ఆషాఢ మాస బోనాలు కొనసాగనున్నాయి. బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు కల్పించారు.
కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించటంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 5 బోనాలు సమర్పించారు. ఆ తర్వాత నూట పదహారు బోనాలు అమ్మవారికి సమర్పించారు.
ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన