ETV Bharat / state

కేసీఆర్​ ఎన్డీఏలో చేరాలి: రాందాస్ అథావలె

తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్​ ఎన్డీఏలో చేరాలని కేంద్రమంత్రి రాందాస్ అథావలె అన్నారు. భాజపా ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. చంద్రబాబు చేసిన తప్పును జగన్​ చేయకూడదని... ఏపీ అభివృద్ధి కోసం ఎన్డీఏతో సఖ్యతగా ఉండాలన్నారు.

కేసీఆర్​ ఎన్డీయేలో చేరాలి: రాందాస్ అథావలె
author img

By

Published : Jun 2, 2019, 7:32 PM IST

Updated : Jun 2, 2019, 7:58 PM IST

ఎన్డీఏ మద్దతుతో తెలంగాణ వచ్చిందని... రాష్ట్రానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు సామాజిక న్యాయం, సాధికారత మంత్రి రాందాస్ అథావలె. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్డీఏలో చేరాలని కేంద్ర మంత్రి కేసీఆర్​ను కోరారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సామాజిక తరగతులకు అండగా ఉండి న్యాయం చేస్తుందని... అందుకే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకం అనే వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. ఇఫ్తార్ విందులు హిందూ ముస్లిం ఐక్యతకు దోహదం చేస్తాయని చెప్పారు.

దేశమంతా తిరిగారు... మూడు సీట్లే వచ్చాయి: అథావలె

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్లు వస్తున్నాయని... కానీ ఒక్క రాష్ట్రానికి హోదా ఇస్తే... దేశంలోని మరిన్ని రాష్ట్రాలూ కోరే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథావలె అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు వ్యతిరేకంగా దేశమంతా తిరిగారని.. ఆయనకే 3 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. బాబు చేసిన తప్పు జగన్ చేయకుండా ఆంధ్ర అభివృద్ధికి కోసం ఎన్డీఏతో సఖ్యతగా ఉండాలని జగన్​ను కోరారు.

కేసీఆర్​ ఎన్డీఏలో చేరాలి: రాందాస్ అథావలె

ఇవీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..

Intro:Body:Conclusion:
Last Updated : Jun 2, 2019, 7:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.