పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించినట్లు సీఎం తెలిపారు. మందుల కొనుగోలు కోసం రూ.440 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 40 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా... మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. కంటి వెలుగు లాగానే ఈఎన్టీ పరీక్షలతో తెలంగాణ ప్రజలను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు రూ.5,536 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఆరోగ్యవంతులుగా చూడాలి - TELANGANA
తెలంగాణ ప్రజలను పూర్తి ఆరోగ్యవంతంగా చూడటమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. మెరుగైన వైద్యాన్ని పేదలకు చేరువ చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైందని స్పష్టం చేశారు.