ETV Bharat / state

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం: అమిత్ షా - amithsah at shamshabad

హైదరాబాద్​లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం: అమిత్ షా
author img

By

Published : Jul 6, 2019, 6:17 PM IST

Updated : Jul 6, 2019, 7:40 PM IST

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసి తీరుతామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా భాజపా అఖండ విజయం సాధించాక తొలిసారి హైదరాబాద్​కు వచ్చిన షా... పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో భాజపా 20 శాతం ఓట్లు సాధించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్​లో కలిపేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ స్థానం లేకుండా పోయిందని, అయినా పరాజయాన్ని అంగీకరించలేకపోతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్ తదితరులు అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరారు.

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం: అమిత్ షా

ఇదీ చూడండి: తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రారంభించిన అమిత్​ షా

Last Updated : Jul 6, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.