జోరు వర్షంలోనూ మొక్కలు నాటి రక్షణ ఏర్పాటు చేశారు జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీలో జరిగిన హరితహారం కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. జోరుగా కురుస్తున్న వర్షంలో సైతం హరితహారం కార్యక్రమంలో సర్పంచ్, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని గ్రామస్థులను కోరారు.
జోరు వానలోనూ మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్ - heavy rain in illandhu
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. ఓ వైపు జోరుగా వర్షం కురుస్తున్నా... లెక్కచేయకుండా మొక్కలు నాటారు. వాటికి రక్షణ సైతం ఏర్పాటు చేశారు.
జోరు వానలోనూ మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్