భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీకి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందారు. అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేరు. ఆ గ్రామంలోని పలువురు యువకులే ఆ నలుగురిగా మారారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సమీపంలోని వాగు పొంగి పొర్లుతున్నా... మెడల్లోతూ నీటిలో వాగు దాటుతూ అంత్యక్రియలు నిర్వహించారు.
![funerals to woman, youth did funerals to dead body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12544174_funerals-1.png)
వాగు పొంగుతూ ఉన్నా.. మానవత్వంతో యువకులు ముందుకొచ్చారు. ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు నిర్వహించిన యువతను గ్రామ పెద్దలతో పాటు పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: RAINS: దంచికొట్టిన వానలు.. పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు