రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే 90శాతానికి పైగా అర్హులు మొదటి డోసు పూర్తిచేసుకోగా.. చాలా వరకు రెండో డోసు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రజ్లలో కొవిడ్ టీకాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సైతం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేకంగా డ్రైవ్లు చేపట్టి నూరు శాతం వ్యాక్సినేషన్ కోసం శ్రమిస్తోంది. కరోనా మహమ్మారి నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యాక్సిన్ను.. మారుమూల ప్రాంతాల ప్రజలు అందుకోవడం కొంచెం కష్టమే. అందుకే వారి కోసం యశోద ఫౌండేషన్ ప్రత్యేక దృష్టి సారించింది.
రోడ్డు మార్గం సరిగాలేని మారుమూల గ్రామాల ప్రజలకూ కరోనా టీకా అందాలనే ఉద్దేశంతో యశోద ఫౌండేషన్(YASHODA FOUNDATION) ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలాన్ని ఎంచుకుంది. ఇల్లందు పరిధిలో అధికంగా రవాణా సదుపాయం లేని గ్రామాలు ఉన్నాయి. చల్ల సముద్రం, ఒడ్డుగూడెం, రేపల్లె వాడ, ధనియాల పాడు, లచ్చగూడెం ఇంకా పరిసర గ్రామాల్లో 18సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసేందుకు యశోద ఫౌండేషన్ ముందుకొచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాలతో సామాజిక దూరం పాటిస్తూ అర్హులైన 500 మంది వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టింది.
యశోద ఫౌండేషన్ సమాజం యొక్క అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్స్ ద్వారా పిల్లల విద్యకు సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాల ద్వారా వారికి విస్తృతమైన అవకాశాలను, నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
ఇదీ చదవండి: Balapur laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?