భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం రెండో రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉట్టి కొట్టే వేడుకను వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను చిత్రకూట మండపం వద్దకు తీసుకొచ్చి ఉట్టి వేడుకను నిర్వహించారు.
ఉట్టి కొట్టే వేడుకలో యాదవులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. సుమారు అరగంట పాటు యాదవులు.. ఉట్టిని అందుకునేందుకు ప్రయత్నించగా చివరికి ఆలయ అధికారులు ఉట్టిని అందించారు. ఉట్టి వేడుకలో పాల్గొన్న యాదవులందరికీ ఆలయ అర్చకులు.. నూతన వస్త్రాలను, ప్రసాదాన్ని అందించారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్