భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో ఫిట్టర్ ట్రైనీ ఉద్యోగాలకు కొత్తగూడెంలో రాత పరీక్ష జరిగింది. 128 ఉద్యోగాలకు గాను 2,681 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా సమయం కంటే ముందుగానే వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
మొత్తం ఐదు పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అధికారులు లోపలికి అనుమతించారు. మొదటిసారిగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశారు. ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఇదీ చదవండి: KOMATIREDDY VENKATREDDY: రేవంత్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు..!