ప్రేమించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి ధర్నాకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన యువతి.. అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. దీంతో ప్రియుడిపై పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐనా మాట వినకపోవడంతో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగినట్లు బాధిత యువతి పేర్కొంది.
"మేము గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. అతను మా ఇంటికి వచ్చి దాడి చేశాడు. మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. అతడిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఐనా మాట వినకపోవడంతో ఇంటి ముందు ధర్నాకు దిగాను. ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి." -బాధిత యువతి
ఇదీ చదవండి: 'కాంగ్రెస్కు, తెరాసకు ఇచ్చారు.. భాజపాకూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ప్లీజ్.. ప్లీజ్..'