తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లిలో మహిళలు ఖాళీ బిందెలతో రహదారిపై ఆందోళన చేశారు. గత కొద్ది కాలంగా గ్రామంలో తాగునీటి కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్రమైన ఎండల వల్ల బావుల్లో నీరు పూర్తిగా ఇంకి పోయిందని, మిషన్ భగీరథ పైపుల నుంచి పూర్తి స్థాయిలో నీటి సరఫరా కావడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరకగూడెం ఎస్సై రాజేందర్... సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వగా... మహిళలు ఆందోళన విరమించారు.