ETV Bharat / state

రైతు దీక్షలకు మద్దతుగా మహిళల నిరాహార దీక్షలు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

దిల్లీలో అన్నదాతల దీక్షలకు సంఘీభావం తెలుపుతూ భద్రాచలంలో మహిళలు నిరాహార దీక్షలు చేస్తున్నారు ఐద్వా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు దీక్షలు చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

women-hunger-strike-to-support-farmers-at-bhadrachalam-in-bhadradri-kothagudem
రైతు దీక్షలకు మద్దతుగా మహిళల నిరాహార దీక్షలు
author img

By

Published : Dec 18, 2020, 12:41 PM IST

దిల్లీలో రైతుల దీక్షలకు మద్దతుగా భద్రాచలంలో మహిళలు నిరాహార దీక్ష చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్​లో ఐద్వా మహిళలు రెండు రోజుల పాటు దీక్షలు చేపట్టారు. ఎముకలు కొరికే చలిలో అన్నదాతలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రేణుక తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుని... రైతుల దీక్షను విరమింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మహిళలు చేస్తున్న దీక్షలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా సీపీఎం అధ్యక్షులు తేజ రమేశ్, భద్రాచలం సీపీఎం నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.

ఇదీ చదవండి: మణికట్టు నరం కోసి... కోస్గిలో వ్యక్తి దారుణ హత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.