భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఐలాపురంలో రెండు పడక గదుల ఇల్లు ఖాళీ చేయించారని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. 2017లో ప్రభుత్వం నిర్మించిన 53 ఇళ్లలో లాటరీ పద్ధతిన 41 మందికి కేటాయించారు. మిగిలిన 12 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవటం వల్ల కొంతమంది ఆ ఇళ్లల్లో అనధికారికంగా రెండేళ్ల నుంచి నివాసముంటున్నారు. కొన్ని రోజుల క్రితం రెవెన్యూ అధికారులు అనధికారికంగా ఉంటున్న వారు నివాస గృహాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. గడువు కూడా ఇచ్చారు. అయినా ఖాళీ చేయకపోవటం వల్ల పోలీసుల సాయంతో బలవంతంగా ఖాళీ చేయించారు. అధికారులకు, మహిళలకు వాగ్వాదం చోటు చేసుకుంది. మనస్తాపం చెందిన రహమున్నేషా బేగం అనే మహిళ అదే ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: మొక్కలకు పుట్టినరోజు..చిన్నారుల సంబురాలు..