ETV Bharat / state

తెరాస గెలిస్తే ఇల్లందు బస్ డిపో హామీ ఏమైంది? - badradri kothagudem district news today

పురపాలక ఎన్నికల్లో తెరాస పార్టీ గెలిస్తే ఇల్లందు బస్ డిపో ఏర్పాటు చేస్తానని మంత్రి, ఇల్లందు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం తమ సమస్య అలాగే ఉందనీ, వెంటనే నెరవేర్చాలని ఇల్లందు వాసులు కోరుతున్నారు.

What is the yellandu bus depot guarantee if trs wins
తెరాస గెలిస్తే ఇల్లందు బస్ డిపో హామీ ఏమైంది?
author img

By

Published : Jan 30, 2020, 7:17 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక ఎన్నికల సమయంలో తెరాస పార్టీ గెలిస్తే ఇల్లందులో బస్ డిపో ఏర్పాటు చేస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత తమ సమస్యలు మరచిపోయారని ఇల్లందు వాసులు వాపోతున్నారు. గతంలోనూ పలు మార్లు బస్​డిపో అంశం వచ్చినా మరుగున పడిదంటున్నారు. ఇల్లందు నుంచి రైలు ప్రయాణ సౌకర్యం సైతం ఉండకపోవడం.. చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంత గ్రామాలకు సాయంత్రం బస్సు సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఉదయం సమయంలో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ డిపోల నుంచి బస్సులు వస్తాయి. కానీ సాయంత్రం వేళల్లో లాభాపేక్ష దృష్టితో బస్సులు రావడం లేదంటున్నారు. ఆయా డిపోల నుంచి బస్సులు వస్తేనే ప్రయాణ సౌకర్యాలు ఉంటయని. లేదంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందేనని అంటున్నారు. ఈ పరిస్థితుల గురించి పురపాలక ఎన్నికల్లో తెరాస పార్టీ గెలిస్తే బస్ డిపో ఏర్పాటు చేస్తానన్న మంత్రి, ఇల్లందు ఎమ్మెల్యే హామీలను త్వరగా నెరవేర్చాలని ఇల్లందు వాసులు కోరుతున్నారు.

తెరాస గెలిస్తే ఇల్లందు బస్ డిపో హామీ ఏమైంది?

ఇదీ చూడండి : మేడారం జాతర నాడు నేడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.