ETV Bharat / state

ఇంకుడు గుంతకు లాక్​డౌన్​ గండం... నిలిచిపోయిన నిర్మాణాలు - ఖమ్మంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి ఇక్కట్లు

పట్టణాల్లో నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ పలు కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇంకుడు గుంతలు విరివిగా నిర్మించాలని ఈ ఏడాది మార్చి మొదటి వారంలో పురపాలక సంఘాలకు ఉత్తర్వులు జారీ చేశారు.

water harvesting structure construction stopped
ఇంకుడు గుంతకు లాక్​డౌన్​ అడ్డండి... నిలిచిపోయిన నిర్మాణాలు
author img

By

Published : Aug 4, 2020, 12:36 PM IST

పట్టణాల్లో భూగర్భజలాలను పెంచేందుకు రాష్ట్ర పురపాలక శాఖ పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రాధాన్యమిచ్చింది. మార్చి 6 నుంచి మే 31 మధ్య ప్రత్యేక కార్యాచరణ కింద నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యాలను సైతం విధించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు పురపాలకాల్లో సుమారు 17 వేల ఇంకుడు గుంతలు నిర్మించాలి.

వానాకాలం సీజన్‌ పూర్తికావస్తున్నా క్షేత్రస్థాయిలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. మార్చిలో లాక్‌డౌన్‌, ఆ తర్వాత కొవిడ్‌ కేసుల ప్రభావంతో ఏం చేయలేకపోయామన్నది అధికారుల వాదన. పని ప్రదేశాలను గుర్తించామని, కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితులు కుదుటపడితే వెంటనే ప్రారంభిస్తామంటున్నారు.

ఇంకుడుగుంతల నిర్మాణాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాక ఇంకా రెండు నెలల వేసవికాలం మిగిలి ఉంది. వర్షాకాలానికి ముందే వీటిని నిర్మిస్తే వరద నీటిని భూగర్భంలోకి ఇంకేలా చూడొచ్చన్నది ఉన్నతాధికారుల ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో కొంతైనా నీటి ఎద్దడి నివారించవచ్చనుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఆయా అధికారులకు సూచించారు. ‘పట్టణప్రగతి’లో వార్డులకు కేటాయించిన స్థానిక అధికారులు, ప్రత్యేకాధికారులు, నాలుగు రకాల కమిటీల సేవలను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పురపాలకం వారు, ప్రైవేటు ప్రదేశాల్లో యజమానులు గుంతలు నిర్మించాలి. ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో ప్రదేశాలను గుర్తించగా, ఇంకా మెప్మా సమాఖ్యలు, ఎన్జీవోలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.