నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా ఆసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిషేధించడంతో పాటు వక్ఫ్ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మైనార్టీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ ఎండీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఐజీకి వక్ఫ్ బోర్డు సీఈవో ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. వాటన్నింటిని నిషేధిత భూముల జాబితా 22ఏలో చేర్చి రిజిస్ట్రేషన్లు కాకుండా ఆటోలాక్ విధించాలని స్పష్టం చేసింది.
అదే సమయంలో పట్టణాలు, పల్లెల్లోని వక్ఫ్ భూముల్లో నిర్మాణాలకు ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తుల వివరాలను మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులకు అందించాలని వక్ఫ్ బోర్డు సీఈఓకు తెలిపింది.
ఇదీ చదవండి : గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి