సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జీయర్ ట్రస్ట్, వికాస తరంగిణి, శ్రీ కృష్ణ సేవాసమితిల ఆధ్వర్యంలో విశ్వరూప గోపూజ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. అర్చకులు గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు.
గోవు విశిష్టతను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్ధేశంతో.. ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. పూజల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ఇదీ చదవండి: సంక్రాంతి సంబురం.. ఆలయాల్లో భక్తుల కోలాహలం