ETV Bharat / state

Contaminated water: ఆ నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది..! - జ్వరం, కామెర్లు, డెంగీ వ్యాధుల కారణాలు

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామస్థులు రోడెక్కారు. కలుషిత నీటితో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం వ్యవధిలోనే గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు కామెర్లతో మృతి చెందారు.

Contaminated water
కలుషిత నీరు
author img

By

Published : Jun 23, 2021, 7:28 PM IST

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామస్థులను కలుషిత నీరు భయపెడుతోంది. స్థానిక ఎస్సీ కాలనీలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. పైపులైన్ల లీకేజీలతో మురుగు నీరు.. కుళాయి నీటితో కలిసి ప్రజల ప్రాణాలు తీస్తోంది. నీళ్లు తాగాలంటేనే భయమేస్తోందంటూ.. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగి వారం వ్యవధిలోనే తుంగ కిట్టయ్య(30), వేల్పుల రాంబాబు(35) అనే ఇద్దరు వ్యక్తులు కామెర్ల బారిన పడి మృతి చెందారు. మరి కొంతమంది.. భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.

పట్టించుకోవడం లేదు..

గ్రామంలో కలుషిత నీటి కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నామంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించేంత వరకూ.. కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

వాటర్ స్టోరేజ్ ట్యాంక్​ను నెలల తరబడి శుభ్రం చేయడం లేదు. ట్యాంక్​లో బురద చేరి అందులో బల్లులు, తొండలు, పక్షులు మృతి చెంది ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది.. జ్వరం, కామెర్లు, డెంగీ వంటి వ్యాధుల బారిన పడ్డారు. ఎంతో మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. జనాలు చస్తున్నా పట్టించుకోరా..?

- గ్రామస్థులు

గ్రామస్థుల ఆందోళనలపై అధికారులు స్పందించారు. నారయణపురానికి వెళ్లి.. వాటర్ స్టోరేజ్ ట్యాంక్​ను శుభ్రం చేసే పనిలో పడ్డారు. బాధితుల సౌకర్యార్థం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.

ఇదీ చదవండి: Clay pots: మట్టి కుండలే మహా ఔషధం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.