ఐదేళ్ల చిన్నారి అల్లరి చేసిందని... వాతలు పెట్టింది భద్రాద్రి కొత్తగూడెం చెంచుపల్లి తండాలో నిన్న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల చిన్నారి రోజూ అంగన్వాడీ పాఠశాలకు వెళ్తుండేది. అల్లరి చేస్తుందని అక్కడి ఉపాధ్యాయురాలు గరిటెతో కాల్చి వాతలు పెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు వాతలు చూసి టీచర్ను ప్రశ్నించగా... పొంతన లేని సమాధానం చెప్తూ దాటవేసింది. తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదీ చూడండి: పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!