పల్లె ప్రగతిలో తెలంగాణ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. గ్రామాల్లో అంతర్గత రహదారులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్ పంచాయతీలో 14లక్షలతో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు ప్రారంభించారు.
''మనిషి మరణం తర్వాత తీసుకుపోవడానికి శ్మశానవాటిక లేని ఎన్నో గ్రామాలున్నాయి. ఆ దుస్థితి తీర్చేందుకు వైకుంఠ ధామాలు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తున్నారు''.
-హరిప్రియ, ఎమ్మెల్యే
బాలాజీ నగర్లో 8లక్షల 50వేలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రహదారులకు ఇక్కడే దాదాపు 2కోట్ల అంచనా వచ్చిందన్నారు. అవకాశాన్ని బట్టి రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు.
భాగస్వామ్యం కావాలి..
ఇంటి నంబర్ల, విద్యుత్ మీటర్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్థులు తీసుకొచ్చారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి అరుణతో చర్చించారు. ధరణి ఆన్లైన్ పరిస్థితిపై అధికారులతో మాట్లాడతానని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఇదీ చూడండి: కామారెడ్డి జిల్లాలో 12వేల మందికి వ్యాక్సిన్: ప్రశాంత్ రెడ్డి